: యూపీ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థులను ప్రకటించిన ములాయం
వచ్చే ఏడాది ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో సమాజ్ వాదీ పార్టీ (ఎస్పీ) తమ అభ్యర్థులను ప్రకటించింది. ఎస్పీ అధినేత ములాయం సింగ్ యాదవ్ కొద్దిసేపటి క్రితం ఎన్నికల బరిలో దిగనున్న 325 మంది అభ్యర్థుల జాబితాను ప్రకటించారు. ఈ సందర్భంగా ములాయం మాట్లాడుతూ, 176 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు ఇచ్చామని, త్వరలో మిగిలిన 78 స్థానాలకు అభ్యర్థుల జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.