trump: థామస్ బూసర్ట్ను కీలక పదవిలో నియమించిన డొనాల్డ్ ట్రంప్
కొన్ని రోజుల్లో అమెరికా అధ్యక్ష పీఠంపై కూర్చోనున్న డొనాల్డ్ ట్రంప్ తన ప్రభుత్వంలో ఉండాల్సిన అధికారుల నియామకాలపై కీలక నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళుతున్నారు. జార్జి డబ్ల్యూ బుష్ హయాంలో హోంల్యాండ్ సెక్యూరిటీ డిప్యూటీ అసిస్టెంట్‌గా పనిచేసిన థామస్ బూసర్ట్ను హోంల్యాండ్ సెక్యూరిటీ అడ్వైజర్‌గా నియమిస్తున్నట్లు తాజాగా ట్రంప్ తెలిపారు. అమెరికా అంతర్గత భద్రత, సైబర్ రక్షణ, ఉగ్రవాదంపై పోరుతో పాటు పలు అంశాల్లో ట్రంప్‌కు సలహాదారుగా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. ఈ హోదాలో ఉన్న వ్యక్తికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. శ్వేతసౌధం నుంచి స్వతంత్రంగా వ్యవహరిస్తూ పనిచేస్తారు. ప్రస్తుతం బూసర్ట్.. రిస్క్ మేనేజ్మెంట్ సంస్థ సీడీఎస్ కన్సల్టింగ్‌కు అధ్యక్షుడిగా ఉన్నారు.