: కర్నూలు జిల్లాలో రజనీకాంత్ అల్లుడి సందడి!


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ అల్లుడు, హీరో ధనుష్ కర్నూలు జిల్లాలో సందడి చేస్తున్నాడు. పాణ్యం మండలం తమ్మరాజుపల్లె గ్రామం సమీపంలో తన తాజా చిత్రం 'పవర్ పాండి' షూటింగ్ లో ధనుష్ పాల్గొంటున్నాడు. ఈ విషయాన్ని తెలుసుకున్న కర్నూలు జిల్లా ఎస్పీ రవికృష్ణ అక్కడకు వెళ్లారు. తాను రాసిన 'ఆడపిల్ల' పాటల సీడీని ఆవిష్కరించాలని ధనుష్ ను కోరారు. అది విని చాలా ఆనందానికి గురైన ధనుష్... పాటల సీడీని ఆవిష్కరించాడు.

అనంతరం ఆ పాటలను విని... వాటికి అర్థమేంటో అడిగి తెలుసుకున్నాడు. పాటలు ఎంతో బాగున్నాయంటూ ఎస్పీని అభినందించాడు. ఈ సందర్భంగా ధనుష్ మాట్లాడుతూ, పోలీసు వృత్తిలో ఎన్నో ఒత్తిళ్లు ఉంటాయని... ఇలాంటి పరిస్థితిలో కూడా సమాజం కోసం పాటలను రాయడం అభినందనీయమని అన్నాడు. ఈ కార్యక్రమంలో నంద్యాల డీఎస్పీ హరినాథ్ రెడ్డి, పాణ్యం సీఐ పార్థసారథి రెడ్డి, ఎస్ఐ మురళీమోహన్ రావులు పాల్గొన్నారు. మరోవైపు, యువ హీరో ధనుష్ ను చూసేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్ కు తరలివస్తున్నారు జనాలు. 

  • Loading...

More Telugu News