: 50 ఏళ్లుగా శ్రీవారి సేవలో తరించిన మైత్రీయ స్వామీజీ కాలధర్మం
గడచిన ఐదు దశాబ్దాలుగా తిరుమల శ్రీవారి సేవలో తరించిన ఆర్య మైత్రీయ స్వామీజీ గత రాత్రి కాలధర్మం చెందారు. వయసు పైబడిన కారణంగా వచ్చిన అనారోగ్యంతో ఆయన గత రాత్రి కన్నుమూశారని టీటీడీ తెలియజేసింది. మైత్రీయ స్వామీజీ ఆధ్వర్యంలోనే స్వామివారి నిత్య హారతి కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. మైత్రీయ స్వామీజీ మృతి పట్ల టీటీడీ అధికారులు సహా, పలువురు అర్చకులు సంతాపం తెలుపుతూ, ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.