demonitisation: రద్దయిన నోట్లను కలిగి ఉంటే ఇకపై నేరం?... ఆర్డినెన్స్ జారీపై కేంద్ర కేబినెట్‌ కీలక సమావేశం


బ్యాంకుల్లో పెద్ద‌నోట్లను మార్చుకునేందుకు కేంద్ర ప్ర‌భుత్వం ఇచ్చిన గ‌డువు మ‌రో రెండు రోజుల్లో ముగుస్తున్న‌ విష‌యం తెలిసిందే. వ‌చ్చే ఏడాది మార్చి 31 వ‌ర‌కు ఆర్‌బీఐకి కేవైసీ స‌మ‌ర్పించి రద్దయిన నోట్ల‌ను మార్చుకోవ‌చ్చు. అయితే, గడువుతీరినా బ్యాంకుల్లో జమచేయకుండా ర‌ద్ద‌యిన నోట్లను క‌లిగిన ఉన్న వారిపై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఇందుకోసం అత్య‌వ‌స‌ర ఆదేశం జారీ చేయాల‌ని యోచిస్తోంది.

ఈ ఆర్డినెన్స్ ప్ర‌కారం రూ.10,000 మించి ర‌ద్ద‌యిన నోట్ల‌ను క‌లిగి ఉండ‌డాన్ని నేరంగా ప‌రిగ‌ణించ‌నున్న‌ట్లు తెలుస్తోంది. ఇందుకోసం ఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గ సమావేశం ప్రారంభమైంది. తాము తీసుకు రావాల‌నుకుంటున్న‌ ఈ ఆర్డినెన్స్‌పై కీలక చ‌ర్చ‌లు జ‌రుపుతున్నారు. ఈ ఆర్డినెన్స్‌ ద్వారా రద్దయిన నోట్లను పూర్తి స్థాయిలో వెనక్కి  తీసుకురావాల‌ని కేంద్ర ప్ర‌భుత్వం భావిస్తోంది. ఈ అత్య‌వ‌స‌ర ఆదేశం వచ్చే ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ రూపకల్పనలో కీలకం కానుంది.

  • Loading...

More Telugu News