rahul gandhi: మ‌న డ‌బ్బు మ‌నం తీసుకోవ‌డానికి ప‌రిమితులు విధించారు: రాహుల్ గాంధీ


కేంద్ర ప్ర‌భుత్వం తీసుకున్న‌ పెద్ద‌నోట్ల ర‌ద్దు నిర్ణ‌యంపై కాంగ్రెస్ పార్టీ ఉపాధ్య‌క్షుడు రాహుల్ గాంధీ మ‌రోసారి విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు ఆయ‌న ఢిల్లీలో మాట్లాడుతూ... పెద్ద‌ నోట్ల రద్దు వ‌ల్ల మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు, చిన్న చిన్న వ్యాపారులు, రైతులు ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారని ఆయ‌న అన్నారు. మ‌నం క‌ష్ట‌పడి సంపాదించుకున్న డ‌బ్బు బ్యాంకు నుంచి తీసుకునేందుకు వీలు లేకుండా పోయింద‌ని, మ‌న డ‌బ్బు మ‌నం తీసుకోవ‌డానికి ప‌రిమితులు విధించారని ఆయ‌న ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సామాన్య ప్రజలు మాత్రమే ఇబ్బందులు ఎదుర్కుంటున్నారని ఆయ‌న అన్నారు. న‌ల్ల‌ధ‌నాన్ని అరిక‌ట్ట‌డానికి య‌జ్ఞం చేస్తున్నాన‌ని ప్ర‌ధానమంత్రి న‌రేంద్ర మోదీ అన్నార‌ని, కానీ ఆ య‌జ్ఞం న‌ల్ల‌కుబేరుల‌కు అనుకూలంగా జ‌రుగుతోందని ఆయ‌న ఆరోపించారు. కాంగ్రెస్ అంటే నిజ‌మైన స్వేచ్ఛ‌కు అర్థం చెప్పే పార్టీ అని ఆయ‌న అభివ‌ర్ణించారు.

  • Loading...

More Telugu News