: అమ్మ సమాధి వద్ద ఎలక్ట్రిక్ షాక్... యువతికి తీవ్ర గాయాలు


చెన్నై, మెరీనా బీచ్ లోని జయలలిత సమాధి వద్ద నివాళులు అర్పించేందుకు వెళ్లిన ఓ యువతికి కరెంట్ షాక్ తగిలింది. అక్కడ ఉన్న ఓ విద్యుత్ వైరుపై ఆమె కాలు మోపిన సమయంలో ఈ ఘటన జరిగినట్టు తెలుస్తోంది. వ్యాసర్ పాడి సమీపంలోని కన్నిగ పురం గ్రామానికి చెందిన గుణ సుందరి అనే 32 సంవత్సరాల యువతి, జయలలితకు నివాళులు అర్పించేందుకు వచ్చిందని, తిరిగి వెళుతున్నప్పుడు ఆమెకు షాక్ కొట్టగా, కాలికి, చేతులకు కాలిన గాయాలు అయ్యాయని పోలీసులు తెలిపారు. ఆమెను రాజీవ్ గాంధీ ప్రభుత్వ వైద్యశాలకు తరలించి చికిత్సను అందిస్తున్నామని, కేసు నమోదు చేశామని వెల్లడించారు.

  • Loading...

More Telugu News