: మారుతున్న రాజకీయం... శశికళకు హై సెక్యూరిటీ తొలగింపు, పోయిస్ గార్డెన్స్ లో మిగిలింది ఐదుగురు కానిస్టేబుళ్లే!


జయలలిత మరణం తరువాత తమిళనాడులో రాజకీయాలు శరవేగంగా మారుతున్నాయి. అధికారాన్ని దక్కించుకోవాలని జయ నెచ్చెలి శశికళ ప్రయత్నాలను ఎక్కడికక్కడ విజయవంతంగా అడ్డుకుంటున్నారు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం. ఆమె వర్గంలోని వారికి ఒక్కొక్కరికి చెక్ పెట్టుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళకు హై సెక్యూరిటీని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. జయలలిత బతికున్నప్పటి నుంచి ఆమెతో పాటు శశికళకూ అత్యున్నత స్థాయి పోలీసు భద్రతను కల్పిస్తూ వచ్చిన సంగతి తెలిసిందే.

సోమవారం వరకూ ఈ భద్రత కొనసాగగా, దీన్ని తొలగిస్తూ ఉత్తర్వులు జారీ కాగానే, పోయిస్ గార్డెన్స్ లోని వేదనిలయం నుంచి 80 శాతం భద్రతా సిబ్బంది వెళ్లిపోయారు. ప్రస్తుతం ఐదుగురు కానిస్టేబుళ్లతో మాత్రమే సెక్యూరిటీ కొనసాగుతోంది. ఇక శశికళను సందర్శిస్తున్న నేతల సంఖ్య కూడా క్రమంగా తగ్గుతున్నట్టు తమిళనాట రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. నిన్నమొన్నటి వరకూ పార్టీకి చిన్నమ్మే దిక్కని మోకరిల్లిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఇప్పుడు అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. జరుగుతున్న పరిణామాలు శశికళ ఆధిపత్యానికి చెక్ చెప్పనున్నాయని తెలుస్తోంది.

  • Loading...

More Telugu News