: ఏటీఎంలలో విత్ డ్రా పరిమితి పెంపు?


పెద్ద నోట్ల రద్దు తర్వాత బ్యాంకులు, ఏటీఎంల నుంచి డబ్బును తీసుకోవడంలో కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. బ్యాంకుల్లో డబ్బును డిపాజిట్ చేయడానికి కూడా పలు ఆంక్షలు విధించారు. ఎవరైనా సరే బ్యాంకుల్లో పాత నోట్లను డిపాజిట్ చేయడానికి విధించిన గడువు డిసెంబర్ 30వ తేదీతో ముగుస్తోంది. డిసెంబర్ 30న నోట్ల రద్దు అంశంపై ప్రధాని మోదీ జాతినుద్దేశించి ప్రసంగించబోతున్నారు.

ఈ నేపథ్యంలో, ఏటీఎంల నుంచి విత్ డ్రా చేసుకునే మొత్తంపై ప్రస్తుతం ఉన్న ఆంక్షలను సడలించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఏటీఎంల నుంచి ప్రస్తుతం ఒక రోజుకు రూ. 2,500, వారానికి రూ. 24,000 డ్రా చేసుకునే వెసులుబాటు ఉంది. విశ్వసనీయ సమాచారం ప్రకారం... ఈ మొత్తాన్ని రోజుకు రూ. 4,000, వారానికి రూ. 40,000లకు పెంచనున్నారు. విత్ డ్రా పరిమితిని పూర్తిగా ఎత్తివేయకుండా... కొంత మేర ప్రజలకు ఉపశమనం కలిగించేలా చర్యలు తీసుకోవడానికి కేంద్రం ప్రయత్నిస్తోంది. 

  • Loading...

More Telugu News