: కాన్పూరులో పట్టాలు తప్పిన సెల్డా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్.. క్షతగాత్రుల హాహాకారాలు
మరో రైలు పట్టాలు తప్పింది. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో ఈ తెల్లవారుజామున సెల్డా-అజ్మీర్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి గురైంది. మొత్తం 14 బోగీలు పట్టాలు తప్పాయి. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో ఆ ప్రాంతం మార్మోగుతోంది. సమాచారం అందుకున్న ఎన్డీఆర్ ఎఫ్ బృందాలు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నాయి. బోగీల్లో చిక్కుకున్న వారిని రక్షించి బయటకు తీసుకొస్తున్నాయి. క్షతగాత్రులను సమీపంలోని ఆస్పత్రులకు తరలిస్తున్నారు. ప్రమాదంతో ప్రయాణికులు భయభ్రాంతులకు గురయ్యారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.