: రాష్ట్రపతి గౌరవార్థం విందు.. హాజరైన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు
రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ గౌరవార్థం రాజ్ భవన్ లో గవర్నర్ నరసింహన్ విందు ఏర్పాటు చేశారు. ఈ విందుకు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చంద్రబాబునాయుడు, కేసీఆర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రణబ్ ముఖర్జీకి వారు పుష్పగుచ్ఛాలు అందజేసి.. కరచాలనం చేశారు. ఈ విందుకు ఏపీ, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీ స్పీకర్లు కోడెల శివప్రసాద్, మధుసూదనాచారి, పలువురు మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖ విద్యా వేత్త చుక్కా రామయ్య, ప్రముఖ టెన్నిస్ క్రీడాకారిణి సానియా మీర్జా, రియో ఒలింపిక్స్ పతక విజేత పివి సింధు తదితరులు హాజరయ్యారు.