: జానారెడ్డి ఇంట్లో భోజనం చేయాలని ఉంది.. త్వరలోనే వెళతా!: సీఎం కేసీఆర్


ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి వెళ్లి భోజనం చేయాలన్న తన మనసులోని కోరికను సీఎం కేసీఆర్ బయటపెట్టారు. తెలంగాణ అసెంబ్లీలో బలహీనవర్గాల ఇళ్ల నిర్మాణంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా కేసీఆర్ ఒక కీలక ప్రకటన చేశారు. గతంలో ఇళ్ల నిర్మాణానికి సంబంధించి పేదలు తీసుకున్న రుణ బకాయిల మొత్తం రూ.3,920 కోట్లు మాఫీ చేస్తున్నట్టు ఆయన ప్రకటించారు.

అనంతరం కేసీఆర్ మాట్లాడుతూ, గతంలో ముఖ్యమంత్రులు ప్రతిపక్షనేతల నివాసాలకు వెళ్లి భోజనాలు చేసే గొప్ప సంప్రదాయం ఉండేదని, త్వరలోనే ప్రతిపక్ష నేత జానారెడ్డి ఇంటికి భోజనానికి వెళతానని అన్నారు. తాను సీఎం అయిన తర్వాత ప్రతిపక్షనేత ఇంటికి వెళ్లి భోజనం చేయాలనే కోరిక తనకు ఉందని కేసీఆర్ అనడంతో సభ్యులు నవ్వులు చిందించారు.

  • Loading...

More Telugu News