: మేము తప్పు చేయలేదు... ప్రతి పైసాకు లెక్కలున్నాయి: మాయావతి


తమ ప్రతిష్టను దెబ్బతీసేందుకు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని... దాని కోసం ఉత్తరప్రదేశ్ లోని అధికార యంత్రాంగాన్ని దుర్వినియోగం చేస్తోందని బీఎస్పీ అధినేత్ర మాయావతి ఆరోపించారు. విరాళాల రూపంలో సేకరించిన డబ్బునే తమ పార్టీ అకౌంట్ లో జమ చేశామని... తాము డిపాజిట్ చేసిన ప్రతి పైపాకు లెక్కలున్నాయని చెప్పారు. తాము ఎలాంటి అక్రమాలకు పాల్పడలేదని... చట్ట ప్రకారమే తన సోదరుడు బ్యాంకులో డబ్బును డిపాజిట్ చేశాడని తెలిపారు.

బీజేపీ దళిత వ్యతిరేక విధానాలకు ఇదొక నిదర్శనమని మాయావతి మండిపడ్డారు. దళితురాలిని కావడం వల్లే తనను దెబ్బతీసేందుకు బీజేపీ యత్నిస్తోందని అన్నారు. ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోతామన్న భయంతోనే తమను బీజేపీ టార్గెట్ చేసిందని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో అనుభవిస్తున్న బాధలతో ప్రధాని మోదీపై జనాలు విశ్వాసం కోల్పోయారని... ఎన్నికల్లో బీజేపీకి గుణపాఠం నేర్పుతారని అన్నారు. బీఎస్పీ ఖాతాలో రూ. 104 కోట్లు, మాయావతి సోదరుడు ఆనంద్ బ్యాంకు ఖాతాలో రూ. 1.43 కోట్ల నగదు డిపాజిట్ అయినట్టు ఈడీ అధికారులు నిన్న గుర్తించిన సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News