: ప్రపంచ తొలి ట్రిలియన్ డాలర్ టెక్ సంస్థగా ఆవిర్భవించనున్న మైక్రోసాఫ్ట్


ప్రపంచంలో ట్రిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన తొలి సంస్థగా మైక్రోసాఫ్ట్ అతి త్వరలోనే చరిత్ర సృష్టించనున్నదని ఈ రంగంలోని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 26.2 బిలియన్ డాలర్లు వెచ్చించి లింకెడిన్ ను విలీనం చేసుకున్న తరువాత మైక్రోసాఫ్ట్ మార్కెట్ విలువ గణనీయంగా పెరిగిందని 'జీక్ వైర్' తన ప్రత్యేక కథనంలో పేర్కొంది. మిగతా పెద్ద కంపెనీలైన అమేజాన్, గూగుల్, ఫేస్ బుక్, యాపిల్ వంటి టెక్నాలజీ ఆధారిత సంస్థలతో పోలిస్తే మరింత త్వరగా మైక్రోసాఫ్ట్ ఈ ఘనత సాధిస్తుందని ఈక్విటీ నిపుణుడు మైఖేల్ మార్కోస్కీ వ్యాఖ్యానించినట్టు వెల్లడించింది. సోషల్ మీడియాతో పాటు క్రౌడ్ ఫండింగ్ ఇండస్ట్రీలో సంస్థ శరవేగంగా ఎదుగుతోందని ఆయన తెలిపారు. యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్ తీసుకున్న నిర్ణయాలతో మైక్రోసాఫ్ట్ లాభపడనుందని ఆయన అన్నారు.

  • Loading...

More Telugu News