: 7000 ఎంఏహెచ్ బ్యాటరీతో జియోనీ కొత్త స్మార్ట్ ఫోన్


చైనా కేంద్రంగా పనిచేస్తూ, ఇండియాలో స్మార్ట్ ఫోన్లను విక్రయిస్తున్న జియోనీ, మరో వినూత్న ఫోన్ ను మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. ఎం2017 పేరుతో విడుదలైన దీనిలో 7000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉండటం విశేషం. దీని ధర 6,999 యువాన్లు (సుమారు రూ. 68,400)గా తెలుస్తోంది. ఈ ఫోన్ లో 6 జీబీ ర్యామ్‌, 1.95 జీహెచ్ ఫోర్ కార్టెక్స్ ప్రాసెసర్ 128 గిగాబైట్ల ఇంటర్నల్‌ స్టోరేజీతో పాటు, 5.7 అంగుళాల ఆల్మండ్‌ క్యూహెచ్‌ డీ డిస్‌ ప్లే, వెనుకవైపు 12, 13 ఎంపీ, ముందు 8 ఎంపీ కెమెరాలు, 4జీ సౌకర్యం, ఆండ్రాయిడ్‌ 6.0 మార్ష్‌ మాలో ఆపరేటింగ్ సిస్టమ్, ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ తదితర సదుపాయాలున్నాయి.

  • Loading...

More Telugu News