: ఆన్ లైన్ షాపింగ్ లో మగవారితో పోటీ పడలేకపోయిన మహిళలు!


ఈ పురుషాధిక్య ప్రపంచంలో దాదాపు అన్ని విషయాల్లో ఆడవారి కంటే మగవారి డామినేషనే ఎక్కువగా ఉంటుందనడంలో సందేహం లేదు. చివరకు ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో కూడా ఆడవారి కంటే మగవారి శాతమే ఎక్కువగా ఉందట. ఈ విషయాన్ని ప్రముఖ ఈకామర్స్ సైట్ ఫ్లిప్ కార్ట్ వెల్లడించింది. 2016 ఏడాదికి గాను ఆన్ లైన్ కొనుగోళ్లలో ఆడవారి వాటా 40 శాతానికే పరిమితం కాగా, మగవారి వాటా 60 శాతంగా ఉంది. జనవరి 1వ తేదీ నుంచి డిసెంబర్ 15వ తేదీ వరకు జరిగిన కొనుగోళ్ల ఆధారంగా ఫ్లిప్ కార్ట్ ఈ విషయాన్ని వెల్లడించింది.

 మరోవిషయం ఏమిటంటే... మొబైల్ యాప్ ద్వారానే 80 శాతం మంది కస్టమర్లు కొనుగోళ్లు జరిపారట. ఆన్ లైన్ షాపింగ్ చేస్తున్న వారిలో 25 నుంచి 34 ఏళ్ల మధ్యలో ఉన్నవారే ఎక్కువగా ఉన్నారు. మగవారు ఎక్కువగా ఆడియో, ఫుట్ వేర్, లైఫ్ స్టైల్ ప్రాడక్ట్స్, ఎలక్ట్రానిక్స్ వస్తువులు కొనుగోలు చేశారట. ఈ ఏడాది ఫేవరెట్ బ్రాండ్స్ గా శాన్ డిస్క్, రెడ్ మీ, లెనోవో, శాంసంగ్ నిలిచాయి.

  • Loading...

More Telugu News