: తెలంగాణలో తగ్గనున్న సెల్ ఫోన్ ధరలు


తెలంగాణలో సెల్ ఫోన్ల ధరలు దాదాపు 10 శాతం వరకూ తగ్గనున్నాయి. ఇప్పటివరకూ రాష్ట్రంలో సెల్ ఫోన్లపై 14.5 శాతం వ్యాట్ ఉండగా, దాన్ని 5 శాతానికి తగ్గిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవడమే ఇందుకు కారణం. పక్కనే ఉన్న ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో సెల్ ఫోన్లపై వ్యాట్ (విలువ ఆధారిత పన్ను)  5 శాతంగా మాత్రమే ఉంది. దీంతో వ్యాపారం పక్క రాష్ట్రాలకు తరలి పోతున్నట్టు ప్రభుత్వం గ్రహించింది.

మొబైల్ విక్రయాలపై విధిస్తున్న పన్నుపై హైకోర్టు సైతం కల్పించుకోవడంతో, పన్ను రేటును కుదించడమే మంచిదని సర్కారు భావించిన మీదటే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన బిల్లు ప్రస్తుతం శాసనసభ ముందుంది. పన్ను రేట్లను తగ్గించడం వల్ల అత్యధికులు రాష్ట్రంలోనే సెల్ ఫోన్లు కొనుగోలు చేస్తారని, అమ్మకాలు పెరగడం వల్ల ఖజానాకు అదనంగా రూ. 5 కోట్ల వరకూ ఆదాయం పెరుగుతుందని భావిస్తున్నామని ప్రభుత్వం అంచనా వేస్తోంది.

  • Loading...

More Telugu News