: జైలు నుంచి బయటకు వచ్చిన ఇంద్రాణీ ముఖర్జియా


దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన షీనా బోరా హత్యకేసులో ప్రధాన నిందితురాలు ఇంద్రాణీ ముఖర్జియా జైలు నుంచి విడుదలయ్యారు. తన తండ్రి అంత్యక్రియల నిమిత్తం సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం అనుమతితో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. కాగా, కోర్టు ఆదేశాల ప్రకారం ఒక్కరోజు జైలు నుంచి ముంబైలో ఎక్కడికైనా వెళ్లి అంత్య క్రియలు నిర్వహించుకోవచ్చని తెలిపింది. దీంతో ఆమె జైలు నుంచి బయటకు వచ్చారు. మీడియాతో మాట్లాకూడదన్న నిబంధన ఉండడంతో ఆమె ఎవరితోనూ మాట్లాడకుండానే వెళ్లిపోయింది. కాగా, ఇదే కేసులో ఆమె భర్త పీటర్ ముఖర్జియా కూడా జైలు జీవితం గడుపుతున్న సంగతి తెలిసిందే. 

  • Loading...

More Telugu News