: పేదవాడినని, పూటగడవదని చెప్పుకునే సోమిరెడ్డికి అన్ని కోట్లు ఎక్కడవి?: నిలదీసిన ఎమ్మెల్యే కాకాని
తాను పేదవాడినని, పూట గడవదని నిత్యం చెప్పుకునే టీడీపీ నేత సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డికి కోట్లాది రూపాయలు ఎలా వచ్చాయని వైఎస్సార్ సీపీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాని గోవర్ధన్‌రెడ్డి ప్రశ్నించారు. సోమిరెడ్డికి విదేశాలతోపాటు కర్ణాటకలోని పవర్ ప్రాజెక్టులో రూ.30 కోట్ల పెట్టుబడులు ఉన్నాయని ఆరోపించారు. సాగర్ పవర్ కంపెనీ లిమిటెడ్‌లో సోమిరెడ్డి సతీమణి జ్యోతి డైరెక్టర్‌గా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అందులో వారి పెట్టుబడులు రూ.30 కోట్లు ఉన్నాయని పేర్కొంటూ, కంపెనీ డైరెక్టర్ల పేర్లు ఉన్న పేపర్‌ను విడుదల చేశారు. సోమిరెడ్డిపై చేసిన ప్రతి ఆరోపణకు తన వద్ద ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేశారు. అవి తప్పని నిరూపిస్తే తాను రాజకీయాల నుంచి తప్పుకుంటానని కాకాని సవాల్ విసిరారు.