: నోట్ల రద్దు అనంతర కష్టాలు కొత్త సంవత్సరంలోనూ తప్పవు: బ్యాంకు ఉద్యోగుల సంఘం
పెద్దనోట్ల రద్దు అనంతర కష్టాలు కొత్త ఏడాదిలోనూ తప్పవని ఆల్ ఇండియా బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ (ఏఐబీఈఏ) జనరల్ సెక్రటరీ సీహెచ్ వెంకటాచలం అన్నారు. బ్యాంకుల వద్ద ఇప్పటికీ రద్దీ కొనసాగుతూనే ఉందని, ఇప్పట్లో ఉపశమనం కలిగే అవకాశం కనిపించడం లేదని అన్నారు. కాగా, పెద్దనోట్ల రద్దు అనంతరం ఆయా నోట్లను మార్చుకునేందుకు, డిపాజిట్ చేసేందుకు ప్రజలు బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారు. చిన్న నోట్ల కోసం బ్యాంకులు, ఏటీఎంల వద్ద గంటల తరబడి నిలబడితే కానీ, ‘చిల్లర’ దొరకని పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే.