: 'పెద్దనోట్ల రద్దు' పోరుపై ఢిల్లీలో రాహుల్ గాంధీ కీలక భేటీ
పెద్దనోట్ల రద్దు అనంతరం ప్రజలు పడుతున్న ఇబ్బందులపై తీవ్రస్థాయిలో మండిపడుతున్న కాంగ్రెస్ నేతలు ఈ అంశంలో పోరాటానికి భవిష్యత్ కార్యాచరణ రూపొందించుకోవడానికి ఈ రోజు సాయంత్రం ఢిల్లీలో సమావేశమయ్యారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అధ్యక్షతన ఈ సమావేశం ప్రారంభమైంది. ఈ సమావేశానికి కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు, రాష్ట్రాల ఇన్ఛార్జ్లు, పలు రాష్ట్రాల కాంగ్రెస్ అధ్యక్షులు హాజరయ్యారు.