: ఆహ్వానించినందుకు సంతోషం... కానీ రాలేం!: సోనియాగాంధీకి షాకిచ్చిన మూడు పార్టీలు


పెద్ద నోట్ల రద్దుకు వ్యతిరేకంగా విపక్ష పార్టీలన్నింటినీ ఏకం చేసి పార్లమెంటు ఎదుట ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టేందుకు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ చేసిన ప్రయత్నాలు అనుకున్నంత ఫలితాన్ని ఇవ్వలేదు. సోనియా పంపిన ఆహ్వానాన్ని మూడు పార్టీలు తిరస్కరించాయి. 'మీరు పంపిన ఆహ్వానానికి చాలా సంతోషమని... కానీ తాము రాలేమంటూ' ఎన్సీపీ, జేడీయూ, సీపీఎం పార్టీలు తేల్చి చెప్పాయి. మొన్నటి శీతాకాల సమావేశాల సందర్భంగా అన్ని పార్టీలను కలుపుకుని ఉభయ సభలను స్తంభింపజేయడంలో కాంగ్రెస్ పార్టీ సఫలీకృతమైంది. ఇదే విధంగా, మరోసారి అధికార బీజేపీని ఇరుకున పెట్టేందుకు ఆ పార్టీ వ్యూహ రచన చేసింది. కానీ, అది విఫలమైంది. ఈ సందర్భంగా సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి  సీతారాం ఏచూరి మాట్లాడుతూ, పార్లమెంటులో సహకరించినంత సులువుగా బయట తాము సహకరించలేమని చెప్పారు. జేడీయూ నేత త్యాగి మాట్లాడుతూ, నోట్ల రద్దుపై అన్ని పార్టీల వైఖరి ఒకేలా లేదని అన్నారు. 

  • Loading...

More Telugu News