: మోదీ, చంద్రబాబుల పేర్లు చరిత్రలో నిలిచిపోతాయి: వెంకయ్యనాయుడు


పోలవరం ప్రాజెక్టు నిర్మాణంతో ప్రధాని నరేంద్రమోదీ, ఏపీ సీఎం చంద్రబాబు పేర్లు చరిత్రలో నిలిచిపోతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పోలవరం ప్రాజెక్టు నిధులకు సంబంధించిన చెక్కును చంద్రబాబుకు ఢిల్లీలో అందజేసిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టును మూడేళ్లలో పూర్తి చేస్తామని చంద్రబాబు చెప్పడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వ్యవసాయం, పరిశ్రమలను అభివృద్ధి చేయడం వంటి అంశాలు తమ ప్రభుత్వ అజెండా అన్నారు. రైతు సంక్షేమం నిమిత్తం కిసాన్ బీమా, కిసాన్ క్రెడిట్ కార్డ్స్ ప్రవేశపెట్టడంతో పాటు, నిరంతర విద్యుత్ అందిస్తున్నామని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. 

  • Loading...

More Telugu News