: భారత సైనిక శక్తిని బలోపేతం చేసిన అగ్ని-5... క్షిపణి గురించిన ఆసక్తికర అంశాలు!


ఈ ఉదయం అగ్ని శ్రేణిలో ఐదవ తరం క్షిపణి ప్రయోగాన్ని నిర్వహించిన శాస్త్రవేత్తలు విజయం సాధించారు. భారత సైనిక శక్తిని మరింతగా పెంచిన అగ్ని-5 గురించిన ఆసక్తికర అంశాలివి.
* 5,500 నుంచి 5,800 కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించేలా తయారైన ఖండాంతర క్షిపణి ఇది.
* డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్ మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో), గైడెడ్ మిసైల్ డెవలప్ మెంట్ ప్రోగ్రామ్ లో భాగంగా ఇది తయారైంది.
* 1,500 కిలోల బరువున్న అణ్వస్త్రాన్ని ఇది సునాయాసంగా మోసుకెళుతుంది.
* ప్రస్తుతం ప్రయోగదశలోనే అగ్ని-5 ఉంది. అగ్ని 1, 2, 3 శ్రేణి క్షిపణులు ఇప్పటికే సైన్యం అమ్ములపొదిలోకి చేరిపోయాయి.
* ఇండియాలోని ఏ ప్రాంతం నుంచీ అయినా, సుదూరంగా ఉన్న లక్ష్యాల పేల్చివేతకు ఉపకరిస్తుంది.
* ఈ మిసైల్ ను 2012, 2013, 2015 సంవత్సరాల్లో సైతం ప్రయోగించి చూశారు.
* నేడు ఒడిశా తీరం నుంచి జరిపిన పరీక్ష అగ్ని-5కు ఆఖరిది.
* దీనికి అణ్వస్త్రాలను జోడించే ముందు స్ట్రాటజిక్ ఫోర్సెస్ కమాండ్ మరోసారి పరీక్షలు నిర్వహిస్తుంది.

  • Loading...

More Telugu News