: కఠిన షరతులతో ఎస్పీ త్యాగికి బెయిల్ మంజూరు
సంచలనం కలిగించిన అగస్టా వెస్ట్ ల్యాండ్ కుంభకోణంలో ఎయిర్ ఫోర్స్ మాజీ చీఫ్ ఎస్పీ త్యాగికి కఠిన షరతులతో కూడిన బెయిల్ ను పాటియాలా కోర్టు కొద్దిసేపటి క్రితం మంజూరు చేసింది. రూ. 2 లక్షల పూచీకత్తుపై ఆయనకు బెయిల్ ఇచ్చింది. ఈ సందర్భంగా కోర్టు పలు ఆంక్షలను విధించింది. ఈ కేసులో సీబీఐ సాక్షులుగా పేర్కొన్న వారెవరితోనూ త్యాగి ములాఖత్ కారాదని ఆదేశించింది. కోర్టు అనుమతి లేకుండా త్యాగి పట్టణాన్ని విడిచి వెళ్లరాదని, విదేశీ ప్రయాణాలు నిషేధమని పేర్కొంది. జనవరి 4న త్యాగి విచారణ నిమిత్తం కోర్టుకు హాజరు కావాలని పేర్కొంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న సంజీవ్ త్యాగి, గౌతమ్ ఖైతాన్ ల బెయిల్ పిటిషన్లపై విచారణను అదే రోజు చేపడతామని వెల్లడించింది.