: కోదండరాం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి: బాల్క సుమన్


తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాంపై టీఆర్ఎస్ ఎంపీ బాల్క సుమన్ మరోసారి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కోదండరాం ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న వారందరికీ సీఎం కేసీఆర్ పెద్దపీట వేశారని, ఎవరికీ అన్యాయం చేయలేదన్నారు. ప్రభుత్వంపై బురదజల్లే పనిని కోదండరాం మానుకోవాలని, ఆయన చేస్తున్న దుష్ప్రచారాన్ని టీఆర్ఎస్ కార్యకర్తలు తిప్పి కొట్టాలని పిలుపు నిచ్చారు. లక్షమంది కోదండరాంలు అడ్డుపడ్డా ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలను అడ్డుకోలేరని, కాంగ్రెస్ పార్టీని బతికించేందుకు కోదండరాం ప్రయత్నిస్తున్నారని బాల్క సుమన్ విమర్శించారు. 

  • Loading...

More Telugu News