: సంక్రాంతికి కోడి పందాలు వీల్లేదు!: హైకోర్టు ఆదేశాలు


తెలుగు సంప్రదాయంలో సంక్రాంతి పండగకు ఎంత ప్రాధాన్యముందో అందరికీ తెలిసిందే. ఈ పండగ పేరు చెబితే, వెంటనే గుర్తొచ్చే సంబరాల్లో కోడి పందాలు కూడా ఉంటాయని ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ముఖ్యంగా ఉభయ గోదావరి, కృష్ణా జిల్లాల్లో ఈ పందాలు ఎంతో ప్రతిష్ఠాత్మకం కూడా. కోడి పందాల పేరిట మూగ జీవాలను హింసించడం సరికాదని జంతు ప్రేమికులు ఎంతగా వాదిస్తున్నా, ఆ సమయం వచ్చేటప్పటికి పోటీలు యథాతథంగానే సాగుతుంటాయన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే, ఈ సంవత్సరం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ కోడి పందాలను నిర్వహించేందుకు వీల్లేదని తెలుగు రాష్ట్రాల హైకోర్టు కొద్దిసేపటి క్రితం ఆదేశించింది. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలపై వాదనలు విన్న న్యాయమూర్తులు, వీటిని నిర్వహించకుండా చర్యలు తీసుకోవాలని చంద్రబాబు సర్కారుకు ఆదేశాలు జారీ చేసింది.

  • Loading...

More Telugu News