: క్రికెటర్ షమీ భార్య స్లీవ్ లెస్ డ్రెస్ వేసుకుందని... విమర్శలు కురిపించిన నెటిజన్లు


టీమిండియా పేస్ బౌలర్ మొహమ్మద్ షమీ ఊహించని చేదు అనుభవాన్ని ఎదుర్కొన్నాడు. తన భార్యతో కలసి దిగిన ఓ ఫొటోను ఫేస్ బుక్ లో సరదాగా అప్ లోడ్ చేశాడు. ఈ ఫొటోలో అతని భార్య హసిన్ జహాన్ స్లీవ్ లెస్ డ్రెస్ ధరించి ఉంది. దీంతో, అతనిపై కొందరు ముస్లిం నెటిజన్లు విమర్శల వర్షం కురిపించారు. 'నీవసలు ముస్లింవేనా... నీ భార్య ఇలాంటి డ్రెస్ వేసుకోవడం ఏమిటంటూ ప్రశ్నించారు. వదినను పరదాలో ఉంచు' అంటూ కొందరు సూచించారు. 'నువ్వు చేసుకున్నది ముస్లింనా? లేక హిందువునా?' అని కూడా ప్రశ్నించారు.

మరోవైపు మరికొందరు ముస్లింలు షమీకి అండగా నిలబడ్డారు. వీరిలో క్రికెటర్ మొహమ్మద్ కైఫ్ కూడా ఉన్నాడు. కైఫ్ స్పందిస్తూ, "కొందరి వ్యాఖ్యలు సిగ్గుపడేలా ఉన్నాయి. షమీకి నా మద్దతు ఉంటుంది" అని చెప్పాడు. ఇండియన్ ముస్లింలు మీలాగే ఉండాలంటూ మరికొందరు కామెంట్ చేశారు.

  • Loading...

More Telugu News