: బాలయ్య, శ్రేయలతో కలసి నటించిన తెలుగుదేశం ఎమ్మెల్సీ శమంతకమణి... సీన్ ఇదే!


తెలుగుదేశం ఎమ్మెల్సీ, అనంతపురం జిల్లా మహిళా నేత శమంతకమణి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి'లో నటించారు. ఈ విషయాన్ని ఆమే స్వయంగా వెల్లడించారు. సినిమాలో తాను నటించిన సీన్ గురించి ఆమె వివరించారు. బాలకృష్ణ, శ్రేయలు మారువేషంలో ఓ గ్రామీణ మార్కెట్ కు వెళ్లిన సమయంలో శమంతకమణి కనిపిస్తారు. ఆ సమయంలో శాతకర్ణి (బాలకృష్ణ) జేబు నుంచి ఓ నాణెం కిందపడిపోతుంది. అదే నాణెంపై శ్రేయ కాలుమోపబోగా, అక్కడి మార్కెట్ లో మహిళా వ్యాపారి పాత్రలో నటిస్తున్న శమంతకమణి దాన్ని చూస్తారు. శ్రేయ ఆ నాణెంపై కాలు పెట్టే సమయంలో తన చెయ్యి పెట్టి అడ్డుకుంటారు.

"కాలు తీయ్‌.. మా దేవుడినే తొక్కుతావా?" అంటూ గద్దిస్తారు కూడా. ఆ నాణెం శాతకర్ణి ముఖ చిత్రంతో ఉన్నదే కావడం విశేషం. ఇలా రెండు నిమిషాల పాటు సాగే సన్నివేశంలో తాను నటించానని శమంతకమణి తెలిపారు. తన పాత్ర గురించిన మరిన్ని వివరాలు, సినిమా చూస్తే తెలుస్తాయని ముక్తాయింపునిచ్చారు.  

  • Loading...

More Telugu News