: ఘోర ప్రమాదం... గ్యాస్ ఏజెన్సీ గోడౌన్ లో ఒకేసారి పేలిన వెయ్యి సిలిండర్లు!


కర్ణాటకలోని చింతామణి పట్టణంలో ఘోర ప్రమాదం సంభవించింది. స్థానికంగా ఉన్న ఓ హెచ్‌పీ గ్యాస్ ఏజెన్సీలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. గోడౌన్ లో ఉన్న వెయ్యి సిలిండర్లు ఒక్కసారిగా పేలిపోయాయి. ఈ ఘటనలో గ్యాస్ ఏజెన్సీ ధ్వంసమయింది. మరో మూడు వాహనాలు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదం నిన్న రాత్రి సంభవించింది. పేలుడుతో పరిసర ప్రాంతాలు కంపించిపోయాయి. చుట్టుపక్కల ఉన్న వారు భయభ్రాంతులకు గురై, పరుగులు పెట్టారు. అయితే, ఈ గ్యాస్ ఏజెన్సీ శివారు ప్రాంతంలో ఉండటంతో, ప్రాణ నష్టం జరగలేదు. అగ్నిమాపక సిబ్బంది దాదాపు ఐదు గంటల పాటు శ్రమించి, మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రస్తుతానికి పరిస్థితి అదుపులోకి వచ్చిందని అధికారులు తెలిపారు.

  • Loading...

More Telugu News