: ప్రేమ పేరుతో లేడీ కానిస్టేబుల్ ను మోసం చేసిన ఎస్ఐ
ఆపదలో ఉన్న ఆడవారికి అండగా నిలిచి, న్యాయం చేయాల్సిన ఓ ఎస్సై... తన సుఖం కోసం ఓ మహిళ జీవితాన్ని నాశనం చేశాడు. వివరాల్లోకి వెళ్తే, చిత్తూరు జిల్లా కేబీపురంలో శివకుమార్ ఎస్ఐగా పని చేస్తున్నాడు. కొంత కాలం క్రితం ఓ మహిళా కానిస్టేబుల్ తో అతనికి పరిచయం అయింది. ఆ తర్వాత, పెళ్లి చేసుకుంటానని చెప్పి, ఆమెను నమ్మించి, చివరకు మోసం చేశాడు. దీంతో, అనంతపురం జిల్లా హిందూపురం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఆమె ఫిర్యాదు చేసింది.