: ఇప్పటి ముఖ్యమంత్రులు వాళ్లే సర్వజ్ఞులమని అనుకుంటున్నారు: జైపాల్ రెడ్డి
ఇప్పటి ముఖ్యమంత్రులకు అసెంబ్లీ చర్చలు వినే ఓపిక లేదని, వాళ్లే సర్వజ్ఞులమని అనుకుంటున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జైపాల్ రెడ్డి అన్నారు. ఒక న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, కేవలం మన రాష్ట్రంలోనే కాదు, మిగతా రాష్ట్రాల్లో కూడా ఇదే పరిస్థితి నెలకొని ఉందని అన్నారు. ఇప్పటి ముఖ్యమంత్రులు వాళ్లే సర్వజ్ఞులమని అనుకున్నప్పటికీ, సహనం ఉండాలి కదా! అది కూడా వుండడం లేదని అన్నారు. జవహర్ లాల్ నెహ్రూ కొన్నేళ్ల పాటు ప్రధాన మంత్రిగా ఉన్నారని, ఆయన కంటే తెలివైన వ్యక్తి నాటి పార్లమెంట్ లో లేరని, ఆయన గంటలకొద్దీ పార్లమెంట్ లో గడిపేవారని అన్నారు. పార్లమెంట్ ను గౌరవించే సంప్రదాయాన్ని పటిష్టం చేయాలని నెహ్రూ కోరిక అని చెప్పుకొచ్చారు.