: మరో వివాదంలో కర్ణాటక సీఎం!


గతంలో లక్షల విలువ చేసే ఖరీదైన చేతి గడియారాన్ని ధరించి విమర్శలు ఎదుర్కొన్న కర్ణాటక సీఎం సిద్ధరామయ్య, తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నారు. మైసూరుకు వెళ్లిన ఆయన అక్కడి నుంచి బయలుదేరుతుండగా ఆయన ధరించిన బూట్ల లేసుల ముడి ఊడిపోయింది. దీంతో, ఒక వ్యక్తి ఆ లేసులను కట్టి సరిచేశాడు. అయితే, ఆ విధంగా చేయవద్దని సిద్ధరామయ్య వారించలేదు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు పత్రికలు, ఛానల్స్ లో ప్రసారమయ్యాయి. అంతేకాకుండా, ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాలకు చేరడంతో నెటిజన్లు మరింత మండిపడుతున్నారు. కాగా, సీఎం కార్యాలయం ఈ మేరకు ఒక ప్రకటన చేసింది. సిద్ధరామయ్య బూట్ల లేసులు కట్టిన వ్యక్తి ఆయనకు బంధువని పేర్కొంది. ఇదిలాఉండగా, ఈ విషయమై కర్ణాటక బీజేపీ రాష్ట్ర శాఖ మండిపడుతోంది. దీనిపై సిద్ధరామయ్య వివరణ ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది.  

  • Loading...

More Telugu News