: అరవై నాలుగు కళలలోకి అత్యంత ఉత్సాహం కల్గించేది నాట్యకళ: వెంకయ్యనాయుడు
అరవై నాలుగు కళలలో కెల్లా అత్యంత ఉత్సాహం కల్గించేది నాట్య కళ అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. సిలికానాంధ్ర, ఏపీ సాంస్కృతిక శాఖ సంయుక్తంగా నిర్వహించిన కూచిపూడి నాట్య సమ్మేళనం ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, గతం పునాదులపై వర్తమానం ఆధారపడి ఉంటుందని, కళలు, సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుకోవాల్సిన అవసరం మనపై ఉందని, సమాజంలో శాంతి, సామరస్యం, మానసికోల్లాసానికి కళలు దోహదపడతాయన్నారు.