: ఈ విషయం కొందరు రాజకీయ నేతలకు అర్థం కావట్లేదు: అరుణ్ జైట్లీ


నగదు రహితం అంటే నగదు తక్కువగా వినియోగించడమే తప్ప, పూర్తిగా నగదు లేకపోవడం కాదని, ఈ విషయం కొందరు రాజకీయ నేతలకు అర్థం కావట్లేదని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఢిల్లీలోని విఙ్ఞాన్ భవన్ లో డిజీ-ధన్ మేళాలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా జైట్లీ మాట్లాడుతూ, విదేశాల్లో నల్లధనం దాచుకున్న భారతీయుల సమాచారం కోసం చాలా దేశాలను సంప్రదించామని అన్నారు. కార్డులు, మొబైల్ ఫోన్లు లేని వారి కోసమే ఆధార్ కార్డు ద్వారా చెల్లించే పద్ధతిని ప్రవేశపెట్టామని అన్నారు. దేశంలో 90 శాతం మందికి మొబైల్ ఫోన్లు ఉన్నాయని, పెద్దనోట్ల రద్దు వల్ల ప్రారంభంలో ఇబ్బందులు ఉంటాయని ప్రధాని మొదట్లోనే చెప్పారన్నారు.  

  • Loading...

More Telugu News