: ఒక్కో సినిమా రూ. 20కే... వేల మూవీస్ ను ఆఫర్ చేస్తున్న గూగుల్
ఈ క్రిస్మస్, న్యూ ఇయర్ సందర్భంగా సినీ ప్రియుల కోసం గూగుల్ ప్రత్యేక ఆఫర్ తీసుకొచ్చింది. ప్లే మూవీస్ నుంచి నచ్చిన చిత్రాన్ని రూ. 20కే అద్దెకు తీసుకోవచ్చని వెల్లడించింది. ఇటీవల విడుదలైన జేసన్ బోర్న్, సూసైడ్ స్క్వాడ్, ఫైండింగ్ డోరీ, జటోపియా, జంగిల్ బుక్, సుల్తాన్ తదితరాలతో పాటు ఎక్స్-మెన్, ఎపాకలిప్స్, కెప్టెన్ అమెరికా: సివిల్ వార్స్ వంటి చిత్రాలను అందుబాటులోకి తెచ్చినట్టు తెలిపింది. ఈ ఆఫర్ జనవరి 23 వరకూ అందుబాటులో ఉంటుందని, గూగుల్ ప్లే గిఫ్ట్ కార్డును పొందిన వారు దాన్ని ఉపయోగించి, చిత్రాలను చూడవచ్చని తెలిపింది. స్టార్ వార్స్: ది ఫోర్స్ ఎవేకెన్స్, కుంగ్ ఫూ పండా 3, స్టార్ ట్రెక్ బియాండ్, నౌ యూ సీమీ 2, కీ అండ్ కా, బ్యాట్ మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్, మీనియన్స్, కపూర్ అండ్ సన్స్, పీకు, మనీ మాస్టర్స్ వంటి వేల కొద్దీ చిత్రాల నుంచి తమకు నచ్చిన వాటిని రూ. 20కే చూడవచ్చని పేర్కొంది.