: ఇక జైలుకే... చెక్ బౌన్స్ అయితే మరింత కఠిన శిక్ష!


ఇప్పటికే నోట్ల రద్దు తరువాత నగదు రహిత లావాదేవీలను మరింతగా పెంచే నిర్ణయాలు తీసుకున్న కేంద్రం, 'చెక్ బౌన్స్' విషయంలో మరింత కఠినంగా వ్యవహరించాలని నిర్ణయించింది. ఇచ్చిన చెక్కు చెల్లకుంటే, జైలు శిక్షను ఖాయం చేస్తూ, చట్టాన్ని సవరించాలని మోదీ సర్కారు భావిస్తోంది. ఈ మేరకు త్వరలో జరిగే బడ్జెట్ సమావేశాల్లోనే కొత్త చట్టం తీసుకువచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నట్టు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా, చెక్కు బౌన్స్ అయిన నెల రోజుల్లోగా శిక్ష ఖరారు చేయాలన్నది మోదీ ప్రభుత్వం తేనున్న చట్టంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ చట్టంలో పొందుపరచనున్న మరిన్ని అంశాలపై స్పష్టత వెలువడాల్సి వుంది.

  • Loading...

More Telugu News