: సిరియాలో 92 మందితో వెళుతున్న రష్యా విమానం అదృశ్యం


82 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బందితో వెళుతున్న రష్యా విమానం ఒకటి అదృశ్యమైంది. ఈ విమానం సిరియా మీదుగా వెళుతున్న సమయంలో, రాడార్ వ్యవస్థ నుంచి మాయమైనట్టు ప్రాథమిక సమాచారం. సోచీ ప్రాంతంలో ఉన్న సమయంలో ఈ ఘటన జరిగిందని, లాటకియా వెళ్తున్న ఈ విమానం కూలిందా? లేక ఎవరైనా దాడి చేశారా? అన్న విషయం ఇంకా తెలియరాలేదని రష్యా విమానయాన వర్గాలు వెల్లడించాయి. విమానం అదృశ్యంపై మరిన్ని వివరాలు తెలియాల్సివుంది.

  • Loading...

More Telugu News