: ఒబామాపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన న్యూయార్క్ మాజీ గవర్నర్
మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పదవి నుంచి దిగిపోనున్న బరాక్ ఒబామా 2017లో చనిపోవాలని తాను కోరుకుంటున్నట్టు ట్రంప్ వర్గానికి చెందిన కార్ల్ పలాడినో సంచలన ప్రకటన చేశారు. అధ్యక్ష పదవి నుంచి దిగిపోతున్న ఒబామా.. భార్యతో కలిసి ఆఫ్రికా వెళ్లి అక్కడ చింపాంజీలతో కలిసి గుహలో జీవించాల్సిందేనంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యానించారు. వ్యాపారవేత్త అయిన కార్ల్ పలాడినో రిపబ్లికన్ నాయకుడు. ట్రంప్ ఎన్నికల ప్రచార సమయంలో ఆయన కో చైర్మన్‌గా పనిచేశారు. గతంలో ఆయన న్యూయార్క్ గవర్నర్ గా కూడా పనిచేశారు.
'వచ్చే ఏడాది ఏం జరిగితే చూడాలని మీరు అనుకుంటున్నారు?' అన్న ఓ జర్నలిస్ట్ ప్రశ్నకు పలాడినో పై విధంగా వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. సామాజిక మాధ్యమాల్లో అయితే పలాడినోను దుమ్మెత్తి పోస్తున్నారు. కాగా ఇటువంటి వాటిని తాము ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రోత్సహించబోమని ట్రంప్ అధికార ప్రతినిధి తెలిపారు.