: 'దంగల్' సినిమాను 8,33,000 మంది ఉచితంగా చూసేశారు...ఫేస్ బుక్ లో!
బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమిర్ ఖాన్ నటించిన 'దంగల్' సినిమా నిన్న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందే. చిత్ర యూనిట్ తో సంబంధం లేకుండా ఈ సినిమాను పైరసీ చేసిన ఓ వ్యక్తి దీనిని సోషల్ మీడియా వేదిక ఫేస్ బుక్, యూట్యూబ్ లో విడుదల చేసేశాడు. 'దంగల్' సినిమా ఫుల్ కాపీని ఫేస్ బుక్ లో పెట్టిన 14 గంటల్లో 8,33,000 మంది ఉచితంగా చూసేయడం విశేషం. ఇంకొందరు దీనిని డౌన్ లోడ్ చేసుకున్నారు.
ఈ విషయం చిత్ర యూనిట్ కు తెలియడంతో 'దంగల్' సినిమాను ఫేస్ బుక్, యూట్యూబ్ యాజమాన్యంతో చర్చించి లింక్ తీసేయించారు. ఇది సినిమా విజయాన్ని అడ్డుకోనప్పటికీ... స్మార్ట్ ఫోన్ యుగంలో థియేటర్ కు వెళ్లి చూడాల్సిన అవసరాన్ని తగ్గించేస్తుందని యూనిట్ ఆందోళన వ్యక్తం చేస్తోంది. దీనిని దుబాయ్ కి చెందిన వ్యక్తి సోషల్ మీడియాలో పెట్టినట్టు సైబర్ క్రైమ్ అధికారులు గుర్తించారు.