: నేను బ్రేక్ ఇస్తే... నన్నే కామెంట్ చేస్తాడా? అతని సంగతి చూస్తా!: రాంగోపాల్ వర్మ


'వంగవీటి' సినిమాలో టైటిల్ సాంగ్ పాడిన పన్నాల రాజశేఖర్ కు నేను బ్రేక్ ఇస్తే నాపై మీడియాముందు కామెంట్ చేస్తాడా?.. అంటూ దర్శకుడు రాంగోపాల్ వర్మ మండిపడ్డారు. 'వంగవీటి' సినిమాలో టైటిల్ సాంగ్ పాడింది పన్నాల రాజశేఖర్ అని, అద్భుతంగా పాడాడని, అతనిని విజయవాడలో నిర్వహించిన ఆడియో ఫంక్షన్ లో అందరికీ పరిచయం చేసి, వేదికపై టైటిల్ సాంగ్ పాడించి, ఆ తరువాత అతనిపై ట్వీట్ పెడితే... సినిమాలో పేరేయలేదని పాట తీసేయమంటాడా? అతని సంగతి చూస్తానని రాంగోపాల్ వర్మ హెచ్చరించారు. పేర్లు వేయడం తన పని కాదని, ఎడిటింగ్ లో జరిగిన పొరపాటు అయి ఉంటుందని, అదేదో తెలుసుకోకుండా మీడియా ముందుకు వచ్చి తనమీద పరుష పదజాలం ఉపయోగిస్తే సమస్య పరిష్కారమవుతుందా? అని రాంగోపాల్ వర్మ ప్రశ్నించారు. కాగా, ఈ పాటకు మ్యూజిక్ ను తానే అందించానని, అయితే తన పేరు వేయలేదని పన్నాల రాజశేఖర్ పేర్కొనడం విశేషం. 

  • Loading...

More Telugu News