: తెలంగాణలో కాంట్రాక్ట్ లెక్చరర్ల వేతనాలు పెంపు!
రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో పని చేస్తున్న ఒప్పంద (కాంట్రాక్ట్ బేసిస్) లెక్చరర్ల వేతనాలను పెంచుతున్నట్టు తెలంగాణ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో ఇప్పటి వరకు 18 వేల రూపాయలుగా ఇస్తున్న జీతాన్ని 27 వేల రూపాయలకు పెంచినట్టు ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. ప్రభుత్వం పెంచిన వేతనాలు ఈ నెల నుంచే వర్తించనున్నాయని ప్రభుత్వం తెలిపింది.