naradasu rigister marriage: అడ్వకేట్‌ వర్షను రిజస్టర్ మ్యారేజ్ చేసుకున్న టీఆర్ఎస్ ఎమ్మెల్సీ నారదాసు


హైద‌రాబాద్‌ నాంపల్లిలోని సబ్‌రిజిస్ట్రా‌ర్‌ కార్యాలయంలో టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణరావు (61), అడ్వకేట్‌ అక్కి వర్ష (41)ల వివాహం జ‌రిగింది. నిన్న‌ మధ్యాహ్నం 2 గంటలకు వీరిరువురూ ఒక్క‌ట‌య్యారు. ఇటీవ‌ల జ‌రిగిన‌ గ్రేటర్‌ ఎన్నికల స‌మ‌యంలో నారదాసు హిమాయత్‌నగర్‌ ఎన్నికల ఇన్‌ఛార్జిగా బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించారు. అదే ప్రాంతంలో టీఆర్‌ఎస్‌ మహిళా విభాగం అధ్యక్షురాలిగా అడ్వ‌కేట్‌ వర్ష వ్య‌వ‌హ‌రించేవారు. ఆ సమయంలో వీరిరువురికి స్నేహం ఏర్పడి అది ప్రేమగా మారి వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లి నార‌దాసు సోదరుడు ఎన్‌.ఆగమరావు, స్నేహితుడు జి.శ్రీనివాసరావుల స‌మ‌క్షంలో జ‌రిగింది. తెలంగాణ సీఎం కేసీఆర్‌ను ఈ నూత‌న దంప‌తులు క‌లిసి, ఆశీర్వాదం తీసుకోనున్నారు.

  • Loading...

More Telugu News