: రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ కేంద్ర మంత్రి మనోజ్ సిన్హా ఆసుపత్రి నుంచి రేపు డిశ్చార్జ్!


రైల్వే శాఖ సహాయ మంత్రి మనోజ్ సిన్హా ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది. ఉత్తరప్రదేశ్ లోని తన నియోజకవర్గమైన గోరక్ పూర్ కు బారాబంకి నుంచి వెళుతుండగా... శుక్రవారం రాత్రి 7.15 గంటల సమయంలో తపతి నదిపై ఉన్న బ్రిడ్జి సమీపంలోకి రాగానే ప్రమాదానికి గురైంది. రోడ్డుకు అడ్డంగా ఓ వ్యక్తి రాగా తప్పించే ప్రయత్నంలో వాహనం అదుపుతప్పి పల్టీ కొట్టింది. గాయపడిన మనోజ్ సిన్హాను తొలుత అపోలో ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి రైల్వే ఆస్పత్రికి మార్చారు. మంత్రి పరిస్థితి నిలకడగానే ఉందని, ఆదివారం ఉదయం తిరిగి ఢిల్లీ చేరుకుంటారని నార్త్ ఈస్ట్రన్ రైల్వే ముఖ్య ప్రజా సంబంధాల అధికారి సంజయ్ యాదవ్ మీడియాకు వెల్లడించారు. 

  • Loading...

More Telugu News