: అదుపు తప్పిన కారు.. కేంద్ర మంత్రికి స్వల్ప గాయాలు
రోడ్డు ప్రమాదంలో కేంద్ర మంత్రి మనోజ్ సిన్హాకు స్వల్ప గాయాలయ్యాయి. ఉత్తరప్రదేశ్ లోని గోరఖ్ పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఈ సంఘటన జరిగింది. మనోజ్ సిన్హా ప్రయాణిస్తున్న కారు అదుపు తప్పడంతో ప్రమాదానికి గురైందని సమాచారం. వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు.