: ఈ ఏడాది టాప్ 10 హిందీ సినిమాల్లో అలియా భట్ నటించిన మూడు సినిమాలు!
బాలీవుడ్ యువనటి అలియా భట్ నటించిన మూడు సినిమాలు ఈ ఏడాది మేటి సినిమాల జాబితాలో నిలిచాయి. ఇంటర్నెట్ లో నెటిజన్లు సెర్చ్ చేసిన సినిమాల జాబితా ఆధారంగా ఈ జాబితాను ఎంపిక చేయగా, ఆ జాబితాలో చోటు దక్కించుకున్న సినిమాలు వరుస క్రమంలో....
1. అమితాబ్ బచ్చన్, తాప్సీ నటించిన ‘పింక్’
2. అక్షయ్ కుమార్ నటించిన ‘ఎయిర్‌లిఫ్ట్’
3. బాలీవుడ్ సూపర్ స్టార్ షారూఖ్ ఖాన్, క్రేజీ స్టార్ అలియా భట్ నటించిన ‘డియర్ జిందగీ’
4. షాహిద్ కపూర్, అలియా భట్ నటించిన ‘ఉడ్తాపంజాబ్’
5. సిద్ధార్థ్ కపూర్, అలియా భట్ నటించిన ‘కపూర్ అండ్ సన్స్’
6. సోనమ్ కపూర్ ప్రధాన పాత్రలో రూపొందిన ‘నీర్జా’
7. సుశాంత్ సింగ్ రాజ్ పుత్, దిశా పటానీ నటించిన ‘ఎమ్.ఎస్.ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ’
8. సూర్య, సమంత, నిత్యామీనన్ నటించిన ‘24’
9. ఆర్ మాధవన్, రితికా సింగ్ నటించిన ‘సాలా ఖడూస్’
10. నవాజుద్దీన్ సిద్ధిఖీ నటించిన ‘మదారీ’