: విశాఖలో రంజీ మ్యాచ్ లో కరుణ్ నాయర్, కేఎల్ రాహుల్ అట్టర్ ఫ్లాప్!


ఇంగ్లండ్ తో జరిగిన టెస్టు సిరీస్ లో చివరి టెస్టులో 199 పరుగులతో రాణించిన కేఎల్ రాహుల్, 303 పరుగులతో రికార్డు కొట్టిన కరుణ్ నాయర్ లు విశాఖపట్టణంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు. తమిళనాడు-కర్ణాటక జట్ల మధ్య విశాఖపట్టణంలోని ఏసీఏ-వీడీసీఏ రాజశేఖరరెడ్డి అంతర్జాతీయ స్టేడియంలో ప్రస్తుతం రంజీ మ్యాచ్ జరుగుతోంది. టెస్టు సిరీస్ ముగిసిన అనంతరం వీరిద్దరూ ఇక్కడ రంజీ మ్యాచ్ ఆడుతున్నారు. కర్ణాటక తరుపున బరిలో దిగిన వీరిద్దరూ స్వల్ప వ్యవధిలోనే వెనుదిరిగారు. కేఎల్ రాహుల్ కేవలం 4 పరుగులు చేయగా, కరుణ్ నాయర్ 14 పరుగులకే పెవిలియన్ చేరాడు. దీంతో కర్ణాటక జట్టు తొలి ఇన్నింగ్స్ లో కేవలం 88 పరుగులకే ఆలౌట్ అయింది. మనీష్ పాండే సాధించిన 28 పరుగులే అత్యధికం కావడం విశేషం. అనంతరం బ్యాటింగ్ కు దిగిన తమిళనాడు జట్టు నాలుగు వికెట్లు కోల్పోయి 111 పరుగులు సాధించింది. దినేష్ కార్తీక్ 31 పరుగులతో క్రీజులో ఉన్నాడు. 

  • Loading...

More Telugu News