: నిజంగా 4 కోట్ల ఆఫర్ వచ్చి వుంటే ఎంతో సంతోషించేదాన్ని!: సన్నీలియోన్
బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్ నటిస్తున్న ‘రాయీస్’ చిత్రంలో ‘లైలా మై లైలా’ అనే ఐటమ్ సాంగ్ లో షారూక్ తో కలిసి బాలీవుడ్ నటి సన్నీ లియోన్ నటించింది. ఈ పాటను ఆన్ లైన్ లో ఇటీవల విడుదల కూడా చేశారు. ఈ పాటకు అభిమానుల నుంచి మంచి స్పందన వస్తోంది. ఇదిలా ఉంటే, కొత్త సంవత్సరం సందర్భంగా ముంబయిలో నిర్వహించనున్న ఒక పార్టీలో ఈ పాటకు సన్నీలియోన్ డ్యాన్స్ చేయనుందని, అందుకు గాను రూ.4 కోట్లు తీసుకుంటోందని వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సన్నీలియోన్ స్పందిస్తూ.. ఆ పాటకు డ్యాన్స్ చేయడానికి తనకు నిజంగా రూ.4 కోట్లు ఆఫర్ వస్తే బాగుంటుందని, చాలా సంతోషిస్తానని, ఈ వదంతులు నిజమైతే బాగుండునని చెప్పుకొచ్చింది.