: విడాకుల కోసం.. చెన్నై ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించిన రజనీ కూతురు


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు సౌందర్య విడాకులు కోరుతూ చెన్నైలోని ఫ్యామిలీ కోర్టును ఆశ్రయించారు. తన భర్త అశ్విన్ రాజ్ కుమార్ తో తనకు విడాకులు ఇప్పించాలని కోరుతూ ఈరోజు ఆమె పిటిషన్ దాఖలు చేశారు. కాగా,ప్రముఖ పారిశ్రామికవేత్త అయిన అశ్విన్ తో సౌందర్యకు 2010లో వివాహమైంది. వీరికి ఏడాది పిల్లాడు ఉన్నాడు. వీరిద్దరు విడిపోతున్నారనే వార్తలు వెలువడిన కొన్నిరోజుల తర్వాత సౌందర్య స్పందించిన విషయం తెలిసిందే. మనస్పర్థల కారణంగా గత ఏడాదిగా తాము దూరంగా ఉంటున్నామని, విడాకులు తీసుకునేందుకు నిర్ణయించుకున్నామని చెప్పారు.  

  • Loading...

More Telugu News