: ఇండియా అవసరం ఇప్పుడు అమెరికాకు ఎంతో ఉంది!: సుబ్రహ్మణ్య స్వామి తాజా వ్యాఖ్య


రష్యా బలగాల సహాయంతో సిరియా ప్రభుత్వం నాలుగేళ్ల తరువాత అలెప్పో నగరాన్ని ఉగ్రవాదుల నుంచి స్వాధీనం చేసుకున్న తరువాత బీజేపీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి కీలక వ్యాఖ్యలు చేశారు. రష్యా సహకారంతో సిరియా ముందడుగు వేయడాన్ని అమెరికా వైఫల్యంగా చెబుతూ, అమెరికాకు ఇప్పుడు ఇండియా అత్యవసరమైన దేశమని అభివర్ణించారు. అమెరికాకు బలం ఉంది గానీ సామర్థ్యం లేదని, అమెరికాకున్న సామర్థ్యం ఇప్పుడు ఇండియానేనని వ్యాఖ్యానించారు. అమెరికా తన స్వీయ ప్రయోజనాల కోసమే నిర్ణయాలు తీసుకుంటోందని, ఇండియా అవసరం ఆ దేశానికి ఎంతో ఉందని తన ట్విట్టర్ ఖాతాలో చెప్పుకొచ్చారు. ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని అడ్డుకోవాలంటే, అమెరికా, ఇజ్రాయిల్, ఇండియాలే కీలకమని, ఇండియా, చైనా, ఇరాన్ బంధం కూడా ముఖ్యమేనని అభిప్రాయపడ్డారు.

  • Loading...

More Telugu News